నేటి నుంచి ఆధార్ ప్రత్యేక శిబిరాలు

నేటి నుంచి ఆధార్ ప్రత్యేక శిబిరాలు

KRNL: నగరపాలక సంస్థ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో నేటి నుంచి 26వ తేదీ వరకు ప్రత్యేక ఆధార్ శిబిరాలు నిర్వహించనున్నట్లు నగరపాలక సంస్థ అధికారులు తెలిపారు. విద్యార్థుల ఆధార్ బయోమెట్రిక్ అప్‌డేట్ చేయించనున్నట్లు వెల్లడించారు. 5 నుంచి 15ఏళ్ల లోపు పిల్లలు తప్పనిసరిగా బయోమెట్రిక్ అప్డేట్ చేయించుకోవాల్సి ఉందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఈ సేవలను ఉచితంగా పొందవచ్చన్నారు.