రోడ్డు ప్రమాదంలో వ్యక్తి స్పాట్ డెడ్
NTR: నందిగామ(M) ఐతవరం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు వెనుక నుంచి బైక్ను ఢీకొనడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు చందర్లపాడు (M) తోటరావులపాడు గ్రామానికి చెందిన స్వామిగా గుర్తించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు బస్సు డ్రైవర్ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. మృతదేహాన్ని నందిగామ ప్రభుత్వ ఆసుపత్రి మార్చరీకి తరలించారు.