రాయస్వామి దేవాలయంలో బీజేపీ నేతలు పూజలు
WGL: గీసుగొండ మండలం శాయంపేట హావేలిలోని ఆది మహాలక్ష్మి సమేత పాంచాల రాయస్వామి దేవాలయంలో ఆదివారం ఉదయం బీజేపీ మండల అధ్యక్షుడు కొంగర రవికుమార్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్థి లంకాల దిలీప్ రెడ్డి ఘన విజయం కోసం సంకల్పంతో పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.