కబడ్డీ ప్లేయర్ దారుణ హత్య
పంజాబ్‌లోని లూథియానాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కబడ్డీ ఆటగాడు తేజ్‌పాల్ సింగ్ హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని దుండగులు ఆయనను తుపాకీతో కాల్చి చంపారు. SP కార్యాలయానికి సమీపంలో ఈ ఘటన జరగడంతో తీవ్ర కలకలం సృష్టించింది. పాత గొడవలే ఈ హత్యకు కారణమై ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామన్నారు.