'గ్రామాల్లో అభివృధి కూటమితోనే సాధ్యం'

ELR: గ్రామాల్లో అభివృద్ధి కూటమి తోనే సాధ్యం అని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి దాసరి శ్యామ్ చంద్ర శేషు అన్నారు. ఆదివారం జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురంలో 'సుపరిపాలనలో తొలిఅడుగు' కార్యక్రమం నిర్వహించారు. తల్లికి వందనం గ్యాస్ సబ్సిడీ, రైతులకు ధాన్యం బకాయిలు ఒక్క రోజులొనే ఖాతాలోకి జమ చేయడం, నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఎలా అందుతున్నాయో అడిగి తెలుసుకున్నారు.