అంబులెన్స్‌లో ప్రసవించిన గర్భిణి

అంబులెన్స్‌లో ప్రసవించిన గర్భిణి

ప్రకాశం: దోర్నాల మండలం చిన్న దోర్నాల గ్రామానికి చెందిన గర్భిణికి మంగళవారం రాత్రి పురిటి నొప్పులు అధికమవడంతో కుటుంబీకులు అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చారు. గర్భిణీ స్త్రీ అయిన శృతికి నొప్పులు అధికమవడంతో అంబులెన్స్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్ ఫిజీషియన్ డా. మధు సలహాతో వాహనంలోనే సుఖ ప్రసవం జరిగి, పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.