వైసీపీ ఎంపీపీపై అవిశ్వాస తీర్మానం
KRNL: కర్నూలు మండల పరిషత్ అధ్యక్షురాలు డి.వెంకటేశ్వరమ్మ( వైసీపీ)పై టీడీపీ ఎంపీటీసీలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. కర్నూలులో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో 13 మంది ఎంపీటీసీలు తీర్మానంపై సంతకం చేశారు. మెజారిటీ సభ్యుల తీర్మానాన్ని ఆర్డీవో సందీప్‌కుమార్ ధ్రువీకరించారు. ఈ సమావేశంలో ఆర్డీవో సందీప్‌కుమార్, ఎమ్మార్వో రమేష్‌బాబు పాల్గొన్నారు.