ఎమ్మెల్యే జీఎస్ఆర్‌ను కలిసిన నూతన సర్పంచులు
BHNG: కాంగ్రెస్ పార్టీ భూపాలపల్లి జిల్లా డీసీసీ అధ్యక్షులు బట్టు కర్ణాకర్ ఆధ్వర్యంలో పలువురు నూతన సర్పంచులు సోమవారం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావును మర్యాదపూర్వకముగా కలిశారు. ఈ సందర్భముగా ఎమ్మెల్యే వారిని శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో పలుగుల, మద్దులపల్లి, చండ్రుపల్లి సర్పంచులు విజయలక్ష్మి, సరిత, గురుసింగా బాపు ఉన్నారు