రఘునాధపాలెం–మట్టపల్లి గ్రామాల్లో ఎస్సీ రిజర్వేషన్ డిమాండ్
సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం రఘునాధపాలెం, మట్టపల్లి గ్రామాల్లో ఇప్పటివరకు సర్పంచ్ పదవిపై ఎస్సీ రిజర్వేషన్ అమలు కాలేదని స్థానిక ఎస్సీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నో ఏళ్లుగా అవకాశం లేక ఉన్నామని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఎస్సీ రిజర్వేషన్ అమలు చేయాలని కోరుతూ RDOకు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు పాల్గొన్నారు.