జిల్లా వ్యాప్తంగా విజిబుల్ పోలీసింగ్ కార్యక్రమం
సత్యసాయి: ప్రజల భద్రత, నేరాల అదుపు కోసం జిల్లా వ్యాప్తంగా 'విజిబుల్ పోలీసింగ్'లో భాగంగా వాహనాల తనిఖీలను విస్తృతం చేశారు. జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాలతో ప్రధాన రహదారులు, కూడళ్ల వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు. లైసెన్స్, హెల్మెట్, సీటు బెల్ట్ వినియోగం తనిఖీ చేస్తున్నారు. మద్యం తాగి వాహనం నడిపేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.