చెవిలో పువ్వుతో నిరసన

SRCL: ముస్తాబాద్‌లోని స్వర్ణకారులు చెవిలో పువ్వు పెట్టుకొని నిరసన చేశారు. మండల కేంద్రంలో ఓ వ్యక్తి జ్యువెలరీ షాప్‌ను నూతనంగా ఏర్పాటు చేస్తున్నందున దాన్ని తొలగించాలని డిమాండ్ చేశారు. 9 రోజులుగా దీక్ష చేస్తున్న క్రమంలో చెవిలో పువ్వుతో నిరసన తెలిపారు. అధికారులు ఆ షాపును గ్రామంలో నుంచి తొలగించే వరకు మా నిరసన దీక్షలు ఆగవని అన్నారు.