నూతన SP గా నితికా పంత్ బాధ్యతల స్వీకరణ
ASF: ఆసిఫాబాద్ జిల్లా నూతన SPగా నితికా పంత్ శనివారం బాధ్యతలు చేపట్టారు. జిల్లాను ప్రశాంతంగా ఉంచేందుకు అన్ని వర్గాల ప్రజల సహకారం తీసుకుంటామన్నారు. గంజాయి, సైబర్ నేరాల నివారణపై గట్టిచర్యలు తీసుకుంటామన్నారు. గంజాయి, అక్రమ రవాణాదారులు, విక్రేతలను గుర్తించి కఠినంగా వ్యవహరిస్తామన్నారు. మహిళలు, చిన్నారులపై జరిగే నేరాల నియంత్రణపై దృష్టి సారిస్తామన్నారు.