మైలవరం పాఠశాలల్లో ఉచిత కంటి పరీక్షలు

NTR: లయన్స్ క్లబ్ ఆఫ్ మైలవరం ఆధ్వర్యంలో, లయన్స్ ఇంటర్నేషనల్ పీడీజీ డాక్టర్ వై.జగన్మోహన్ రావు మెమోరియల్ చైల్డ్ ఐ కేర్ సహకారంతో మైలవరంలోని ఆక్స్ఫర్డ్, వివేకానంద, ఎస్ ఎస్ కే పాఠశాలల్లోని విద్యార్థులకు శుక్రవారం ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు. విద్యాశాఖ అధికారి ఎల్.బాలు, లయన్స్ డిస్టిక్ సర్వీస్ ట్రస్ట్ ప్రాజెక్ట్ అసిస్టెంట్ కోఆర్డినేటర్ లయన్ డాక్టర్ అధ్వర్యంలో కార్యక్రమం జరిగింది.