రాజుపాలెంలో సచివాలయ సేవలకు అంతరాయం

పల్నాడు: రాజుపాలెం సచివాలయంలో కంప్యూటర్లు పాడవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఒకే కంప్యూటర్‌పై సిబ్బంది పని చేయాల్సి వస్తుండటంతో సేవలు ఆలస్యమవుతున్నాయి. దీని వల్ల రైతులు, ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ఈ సమస్యపై స్పందించి వెంటనే కంప్యూటర్లకు మరమ్మతులు చేయించాలని గ్రామ సర్పంచ్, సంబంధిత అధికారులను ప్రజలు కోరుతున్నారు.