అన్నదాన కార్యక్రమంలో పాల్గొన ఎమ్మెల్యే
కృష్ణా: గుడివాడ జనసేన ఇంఛార్జ్ బూరగడ్డ శ్రీకాంత్ పుట్టినరోజు వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఈ కార్యక్రమంలో పాల్గొని శ్రీకాంత్‌కు శుభాకాంక్షలు తెలిపారు. పవన్ కళ్యాణ్ ఆశయ సాధన కోసం ఆయన నిరంతరం కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే కొనియాడారు. అనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో నేతలు పాల్గొన్నారు.