నదిలో మునిగి విద్యార్థి మృతి
SKLM: పాతపట్నంలో ఉన్న శ్రీ నీలకంఠేశ్వర స్వామి ఆలయ సమీపంలోని మహేంద్రతనయ నదిలో కె.సాయి తేజ (16) అనే విద్యార్థి మునిగి మృతి చెందారు. ఆదివారం నదికి స్నానానికి వచ్చిన బాలుడు నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో కొట్టుకు పోయినట్లు స్థానికులు తెలిపారు. స్థానికులు బయటకు తీసి ఆసుపత్రికి తరలించగా.. వైద్యులు మృతి చెందినట్లు తెలిపారు.