'భవన నిర్మాణాలకు అనుమతులు తప్పనిసరి'
TPT: తిరుపతి నగరంలో భవన నిర్మాణానికి మున్సిపల్ అనుమతులు తప్పనిసరిగా ఉండాలని కమిషనర్ ఎన్.మౌర్య తెలిపారు. భూపాల్ హౌసింగ్ కాలనీ, కూరపాటి లేఅవుట్లో పర్యటించిన ఆమె అనుమతులు లేకుండా నిర్మాణాలు చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కుక్కల బెడద నివారణకు వెంటనే చర్యలు చేపట్టాలని వెటర్నరీ అధికారిని ఆదేశించారు.