నగరంలో మరోసారి ఈడీ సోదాలు
HYD: నగరంలో మరోసారి ఈడీ సోదాలు నిర్వహించింది. భువన తేజ రియల్ ఎస్టేట్స్ ఇన్‌ఫ్రా కంపెనీపై ఈడీ అధికారులు సోదాలు చేశారు. ప్రీలాంచ్ పేరుతో రూ. 70 కోట్లకు పైగా వసూలు చేసినట్లు పేర్కొన్నారు. ఇప్పటికే హైదరాబాద్ సీసీఎస్‌లో భువన తేజపై కేసు నమోదు కాగా, దీని ఆధారంగా ఈ విచారణ చేపట్టినట్లు అధికారులు తెలిపారు.