CMRF చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

CTR: సీఎం సహాయ నిధి నుంచి మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ అందజేశారు. పార్టీలకతీతంగా అర్హులైన పేదవారందరికీ సీఎం సహాయనిధి అందిస్తున్నామని ఆయన తెలిపారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో గురువారం అనారోగ్యంతో బాధపడుతున్న వారికి సీఎం సహాయ నిధి నుంచి మంజూరైన రూ. 13,37,431 చెక్కులను పంపిణీ చేశారు.