అక్రమంగా మద్యం.. ముగ్గురిపై కేసు నమోదు

అక్రమంగా మద్యం.. ముగ్గురిపై కేసు నమోదు

ADB: అక్రమంగా మద్యం అమ్ముతున్న ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు బోథ్ SI శ్రీ సాయి తెలిపారు. శుక్రవారం రాత్రి సొనాల మండల కేంద్రంలోని అమ్మ కూల్ పాయింట్, చైనీస్ సెంటర్లో మద్యం అమ్ముతున్నారన్న సమాచారంతో దాడి చేసి పట్టుకున్నట్లు తెలిపారు. వారి నుంచి 20 బీర్ బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. A1 యజమాని రమేష్, A2 వర్కర్ ప్రవీణ్, A3 అర్జున్ లపై కేసు నమోదు చేశారు.