నేడు రంజాన్‌

నేడు రంజాన్‌

ముస్లింల పండుగల్లో రంజాన్‌ ముఖ్యమైనది. భక్తి విశ్వాసాలకు, కఠిన ఉపవాస దీక్షలకు నెలవైన ఈ పండుగ ముస్లింలలో భక్తి భావాన్ని, ఆత్మ విశ్వాసాన్ని నింపుతుంది. జకాత్‌, పిత్రా అంటే దాన ధర్మాలకు ప్రతీకగా భావించే ఈదుల్‌ ఫిత్ర్‌ను(రంజాన్‌) ఇవాళ ముస్లింలు జరుపుకోనున్నారు. 30 రోజుల ఉపవాసాలు ముగిసన తర్వాత షవ్వాల్‌ చంద్రదర్శనానంతరం ముస్లింలు ఈ పండుగ జరుపుకుంటారు.