అటవీ శాఖపై సమీక్ష.. కలెక్టర్ కీలక ఆదేశాలు

KMM: అటవీ ప్రాంతాల్లో అగ్నిప్రమాదాల నివారణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో అటవీ శాఖపై నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. అగ్నిప్రమాదాల నివారణకు ఫైర్ వాచర్ల విస్తరణపై దృష్టి సారించాలని తెలిపారు. అలాగే, నిఘా యంత్రాల సాయంతో రానున్న ఎండాకాలంలో మంటలు చెలరేగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని చెప్పారు.