'విద్యార్థుల ఉత్తీర్ణతపై ప్రత్యేక దృష్టి పెట్టాలి'
మార్కాపురంలో సోషల్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ లక్ష్మా నాయక్ అధ్యక్షతన ఎంపీడీవో కార్యాలయంలో శుక్రవారం జిల్లాలోని హాస్టల్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా 10వ తరగతి, ఇంటర్మీడియట్ విద్యార్థుల ఉత్తీర్ణతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, హాస్టళ్లలో విద్యార్థుల సంక్షేమం, ఆరోగ్యం, పరిశుభ్రతపై నిర్లక్ష్యం ఉండకూడదని అధికారులను ఆదేశించారు.