కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం వద్ద భక్తుల రద్దీ
KNR: ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం మంగళవారం భక్తులతో కిటకిటలాడింది. మంగళవారం స్వామివారికి అత్యంత ప్రీతికరమైన రోజు కావడంతో, ఉదయం నుంచే తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో ఆలయ పరిసరాలన్నీ భక్తజన సందోహంగా మారాయి. ఈ సందర్భంగా అర్చకులు అంజన్నకు ప్రత్యేక అభిషేకాలు, అలంకరణలు, అర్చనలు శాస్త్రోక్తంగా నిర్వహించారు.