ALERT: ఈ మండలాల్లో తీవ్ర వడగాలులు
AP: రాష్ట్రంలో ఎండల తీవ్రత నానాటికీ పెరుగుతోంది. గురువారం కోత్తురు(శ్రీకాకుళం)లో గరిష్ఠంగా 45.4°C ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే సాలూరు(మన్యం)లో 45.1, ఆళ్లగడ్డ(నంద్యాల)లో 44.9 డిగ్రీలుగా రికార్డయింది. ఈ నేపథ్యంలోనే శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా 62 మండలాల్లో తీవ్ర వడగాలులు, 89 మండలాల్లో వడగాలులు ప్రభావం చూపుతాయని APSDMA హెచ్చరించింది. అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించింది.