'చెల్లి మృతికి మా బావే కారణం'
SRPT: ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో డాక్టర్ నిర్లక్ష్యంతో సరైన వైద్యం అందక మహిళ మృతి చెందినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని మృతురాలి అన్నయ్య జాగపతి అన్నారు. గత 14 సంవత్సరాలుగా బావే మా చెల్లిని వేధిస్తున్నాడని, వేధింపులు తాళలేక పురుగుల మందు తాగిందన్నారు. ఇంటి పక్కనే ఉన్న మాకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదని తెలిపాడు. చెల్లికి మృతికి కారణమైన బావపై చర్యలు తీసుకోవాలని కోరాడు.