నేడు కొత్తవలసలో అన్న క్యాంటీన్ ప్రారంభం

నేడు కొత్తవలసలో అన్న క్యాంటీన్ ప్రారంభం

VZM: పేదల ఆకలి తీర్చేందుకు రాష్ట్రంలోని అన్ని ప్రధాన మండల కేంద్రాల్లో అన్న క్యాంటీన్‌లు ఏర్పాటుచేయాలని కూటమి ప్రభుత్వం ఎంతో సహృదయంతో తలపెట్టింది. సీఎం చంద్రబాబు 62 అన్న క్యాంటీన్‌లు మంజూరు చేశారని ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి తెలిపారు . అందులో భాగంగా కొత్తవలస కూడలిలో నిర్మించిన అన్న క్యాంటీన్‌ను విశాఖ ఎంపీ ఎం.శ్రీ భరత్, ఎమ్మెల్యే ఇవాళ ప్రారంభించనున్నారు.