ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ

ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ

NRPT: మరికల్ మండలంలోని తీలేరు గ్రామంలో శనివారం డీసీసీ అధ్యక్షుడు ప్రశాంత్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే పేదలకు బడుగులకు న్యాయం జరిగిందని తెలిపారు. సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తుందన్నారు. మాజీ సర్పంచ్ రేవతమ్మ, జిల్లా నాయకులు సూర్య మోహన్ రెడ్డి, ఉన్నారు.