VIDEO: చలి కాచుకునే సమయంలో యువతి మృతి
WGL: సంగెం మండలం కుంటపల్లిలో చలి కాచుకునే సమయంలో పొయ్యి వద్ద ప్రమాదవశాత్తు మంటలు అంటుకుని తీవ్రంగా గాయపడిన నజియా (23) ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. నజియా దివ్యాంగురాలు గతేడాది ఏప్రిల్‌లో వివాహం కాగా, కుటుంబ కలహాల కారణంగా తల్లిగారింట్లోనే నివసిస్తోంది. మృతురాలి తల్లి ఆదివారం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.