యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి

MNCL: యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని జిల్లా షీ టీమ్ ఇంఛార్జి ఇన్‌స్పెక్టర్ నరేష్ పిలుపునిచ్చారు. గురువారం మంచిర్యాలలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డ్రగ్స్, షీ టీమ్ పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. ఎవరైనా డ్రగ్స్ సేవించినా, మహిళలను వేధించినా వెంటనే 100, షీ టీమ్ నెంబర్ 630392370కు ఫిర్యాదు చేయాలని సూచించారు.