జలకళ సంతరించుకున్న ఏల్చూరు చెరువు
BPT: సంతమాగులూరు మండలంలోని ఏల్చూరు చెరువు పూర్తిగా నిండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ చెరువు కింద సుమారు 300 ఎకరాలలో పంటలు పండుతాయని, వేసవిలో పశువులకు నీటి కష్టాలు తీరతాయని గ్రామస్థులు తెలిపారు. చెరువు నిండడం వల్ల భూగర్భ జల సామర్థ్యం కూడా పెరుగుతుందని వారు పేర్కొన్నారు.