VIDEO: మిషన్ భగీరథ పైప్‌లైన్ లీక్

VIDEO: మిషన్ భగీరథ పైప్‌లైన్ లీక్

GDWL: గద్వాల్ జిల్లా, గట్టు మండలంలోని చాగదోన గ్రామంలో మిషన్ భగీరథ పైప్‌లైన్ లీక్ అయ్యి 20 రోజులు దాటిందని గ్రామస్తులు చెబుతున్నారు. చాగదోన నుంచి కొత్తపల్లి వెళ్లే రోడ్డుపై నీరు పైకి చిమ్మడం వల్ల రాకపోకలకు ఇబ్బందులు కలుగుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు పేర్కొన్నారు.