VIDEO: హంద్రీనీవా కాలువ నుంచి కృష్ణా జలాల మళ్లింపు

CTR: శాంతిపురం మండలంలో కొంతమంది రైతులు అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తూ హంద్రీనీవా కాలువల నుంచి పైపులు వేసి నీటిని మళ్లించడం చర్చనీయాశంగా మారింది. కృష్ణా జలాలను ఇప్పటికే కుప్పం నియోజకవర్గ పరిధిలోని చెరువులకు అధికారులు మళ్లిస్తున్నారు. ఈ నేపథ్యంలో చీమనపల్లి వద్ద కొంతమంది కాలువలో సుమారు 20కు పైగా పైపులు వేసి నీళ్లను మళ్లీంచారు.