సర్పంచ్‌లు సేవాభావంతో పనిచేయాలి: మేయర్

సర్పంచ్‌లు సేవాభావంతో పనిచేయాలి: మేయర్

WGL: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన పద్మశాలి ప్రజా ప్రతినిధులు కక్షలు, కార్పణ్యాలకు తావివ్వకుండా సేవాభావంతో పనిచేయాలని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గుండు సుధారాణి పిలుపునిచ్చారు. ఆదివారం హంటర్ రోడ్డులో నిర్వహించిన ‘విక్టరీస్ ఫెలిసిటేషన్’ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. సర్పంచ్ పదవి కీలకమని, ప్రజల ఆశలకు అనుగుణంగా సేవలు అందించాలన్నారు.