ఆసుపత్రి నిర్మాణాన్ని చేపట్టాలని రిలే నిరాహార దీక్ష

ఆసుపత్రి నిర్మాణాన్ని చేపట్టాలని రిలే నిరాహార దీక్ష

RR: చేవెళ్లలో వంద పడకల ఆసుపత్రి నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ గురువారం BJP ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే రత్నం మాట్లాడుతూ.. చేవెళ్లలో 100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి రెండేళ్ల క్రితం నిధులు మంజూరైనట్లు తెలిపారు. ఇప్పటికీ ఆసుపత్రి నిర్మాణ పనులు చేపట్టకుండా ప్రభుత్వం, అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు.