మైలగడ్డ పాఠశాలను సందర్శించిన ఎంఈవో
GDWL: పాఠశాల సందర్శనలో భాగంగా బుధవారం కేటీదొడ్డి మండల విద్యాశాఖాధికారి విజయభాస్కర్ మైలగడ్డ ఎంపీపీఎస్ పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో ఏర్పాటు చేసిన కిచెన్ గార్డెన్‌ను పరిశీలించారు. మధ్యాహ్న భోజన వంటకు బాధ్యత వహిస్తున్న ఏజెన్సీ వారు తప్పనిసరిగా గ్యాస్ కనెక్షన్ తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు మల్లిఖార్జున్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.