వీధి కుక్కల స్వైర విహారం

VSP: జీవీఎంసీ 57వ వార్డు సాకేతపురంలో వీధి కుక్కల సంచారంతో ప్రజలు భయపడుతున్నారు. రోడ్లపై గుంపుగా తిరుగుతున్న కుక్కలు పాదచారులపై దాడులు చేస్తున్నాయి. రాత్రి సమయాల్లో ద్విచక్ర వాహనదారులను వెంబడిస్తున్నాయి. స్థానికంగా ఉన్న మాంసం దుకాణాల నిర్వాహకులు నిత్యం పోగయ్యే వ్యర్థాలను స్థానికంగా ఉన్న కాలువల్లో పారబోస్తుండడంతో ఈ సమస్య ఏర్పడుతుంది.