మహాలక్ష్మి అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారు

మహాలక్ష్మి అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారు

KRNL: మద్దికేర మండలం పెరవలి గ్రామంలోని పురాతన శ్రీ రంగనాథ స్వామి దేవస్థానంలో దసరా శరన్నవరాత్రుల ఉత్సవాలలో భాగంగా ఐదో రోజున రాజ్యలక్ష్మి అమ్మవారిని శ్రీ మహాలక్ష్మిగా అలంకరించారు. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం అర్చకులు భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు.