డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో 39 మందికి జరిమానా

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో 39 మందికి జరిమానా

SDPT: గజ్వేల్ ట్రాఫిక్ సీఐ మురళి తెలిపిన వివరాల ప్రకారం, ఇటీవల గజ్వేల్-ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రధాన చౌరస్తాల వద్ద నిర్వహించిన వాహన తనిఖీల్లో 39 మంది మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు. సోమవారం వారిని గజ్వేల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ స్వాతిగౌడ్ ఎదుట హాజరుపర్చగా, విచారణ అనంతరం 39 మందికి మొత్తం రూ. 39వేల జరిమానా విధించారు.