భారతీయ జనతా పార్టీ @ 47 ఏళ్లు
దేశంలోనే అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ 1980 ఏప్రిల్ 6న ఏర్పడింది. అటల్ బిహారి వాజ్‌పేయి, LK అద్వానీ స్థాపించారు. 1984లో తొలిసారి సాధారణ ఎన్నికలను ఎదుర్కొని కేవలం 2 సీట్లు గెలిచింది. రామజన్మభూమి ఉద్యమంతో 1989లో 75 సీట్లు వచ్చాయి. 1996లో అతిపెద్ద పార్టీగా అవతరించింది. 1996, 98, 99లో వాజ్‌పేయి 3 సార్లు ప్రధాని అయ్యారు. 2014 నుంచి మోదీ ప్రధానిగా కొనసాగుతున్నారు.