VIDEO: తల్లి మృతదేహంతో రాత్రంతా స్మశానంలో
ELR: ఓ మాతృమూర్తి మృతి చెందడంతో అద్దె ఇంటికి వచ్చేందుకు అనుమతి ఉండకపోవడం వలన మృతదేహంతో, మృతురాలి కుమార్తె రాత్రివేళ స్మశానంలోనే ఉన్న విషాద సంఘటన నూజివీడు పట్టణంలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. పట్టణంలోని పాతపేటకు చెందిన రాణి మాతృమూర్తి భారతి వయోభారంతో మృతి చెందారు. అద్దె ఇంటిలో నివసిస్తుండడం వలన ఇంటి యజమానులు మృతదేహాన్ని ఉంచేందుకు అనుమతినివ్వలేదు.