నీటి భద్రత అందరి బాధ్యత: కలెక్టర్

నీటి భద్రత అందరి బాధ్యత: కలెక్టర్

KDP: జలధార కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి సోమవారం 100 రోజుల యాక్షన్ ప్లాన్ ప్రారంభించారు. ఏప్రిల్ 6 నుంచి జూలై 14 వరకు అమలయ్యే ఈ ప్లాన్ ద్వారా నీటి భద్రత, సాగునీటి పొదుపు, డ్రిప్ సాగు, వర్షపు నీటిని ఒడిసిపట్టడం వంటి అంశాలను పటిష్టం చేయాలన్నారు. నీటి సంరక్షణ మనందరి సమిష్టి బాధ్యత అని అధికారులకు ఆయన దిశానిర్దేశం చేశారు.