పీపీపీలోనే మెడికల్ కాలేజీల నిర్మాణం: మంత్రి
సత్యసాయి: మెడికల్ కాలేజీల నిర్మాణంపై ఉనికి కోసం వైసీపీ అనవసర రాద్ధాంతం చేస్తోందని, ఎట్టి పరిస్థితుల్లోనైనా పీపీపీ మోడల్‌లో మెడికల్ కాలేజీలు నిర్మించి తీరుతామని మంత్రి సవిత స్పష్టం చేశారు. ఇవాళ పెనుకొండలో ఆమె మాట్లాడుతూ.. రాజకీయ ఉనికి కోసం వైసీపీ కోటి సంతకాలు, ఆందోళనలు అంటూ డ్రామా రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.