కంభంలో స్కూల్ బస్సుల్లో తనిఖీలు
ప్రకాశం: కంభం పట్టణంలోని ప్రైవేట్ స్కూల్ బస్సులలో రవాణా శాఖ అధికారి మాధవరావు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి బస్సుకు ఎమర్జెన్సీ ఎగ్జిట్ తప్పనిసరిగా ఉండాలని అన్నారు. ప్రతి వెహికల్ ఇంజన్ కు తప్పనిసరిగా ఫైర్ డిటెక్షన్ మరియు సబ్ రేషన్ సిస్టం బిగించాలని అన్నారు. నిబంధనలు పాటించని స్కూల్ బస్సులకు జరిమానా విధించి సీజ్ చేయడం జరుగుతుందన్నారు.