పెనుకొండలో గ్యాస్ గోడౌన్‌ను పరిశీలించిన డీఎస్‌వో

పెనుకొండలో గ్యాస్ గోడౌన్‌ను పరిశీలించిన డీఎస్‌వో

సత్యసాయి: పెనుకొండలో ఉన్న గ్యాస్ గోడౌన్‌ను జిల్లా సరఫరా అధికారి(DSO) వంశీకృష్ణ రెడ్డి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. గోడౌన్‌లో నిల్వ ఉంచిన గ్యాస్ సిలిండర్ల భద్రతా ప్రమాణాలు, నిల్వ విధానం, రికార్డుల నిర్వహణ తదితర అంశాలను ఆయన సమగ్రంగా పరిశీలించారు. ఈ సందర్భంగా గోడౌన్‌లో అగ్నిమాపక పరికరాలు సక్రమంగా ఉన్నాయా లేదా అనే విషయాన్ని పరిశీలించారు.