విమానయానశాఖ కీలక సమీక్ష
గల్ఫ్ సంక్షోభం, విమాన సర్వీసులపై విమానయానశాఖ కీలక సమీక్ష నిర్వహించింది. మంత్రిత్వశాఖ, DGCA అధికారులతో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు భేటీ అయ్యారు. గల్ఫ్‌లో ఉన్నవారిని తీసుకొచ్చేందుకు చేపట్టిన చర్యలను అధికారులు వివరించారు. విమాన సిబ్బంది, స్థానిక ఎంబసీలతో సమన్వయం చేస్తున్నామని వెల్లడించారు. ప్రయాణికులను సురక్షితంగా తీసుకువస్తున్న వివరాలను కేంద్రమంత్రికి అందించారు.