VIDEO: కత్తితో నరుకుతానంటూ వ్యక్తి హల్ చల్

VIDEO: కత్తితో నరుకుతానంటూ వ్యక్తి హల్ చల్

BPT: కత్తితో నరుకుతానంటూ వ్యక్తి హల్ చల్ చేసిన ఘటన బాపట్లలో గురువారం కలకలం రేపింది. బాపట్ల పట్టణ పోలీస్ స్టేషన్ ఎదుట ఓ వ్యక్తి కుటుంబ కలహాల నేపథ్యంలో ఇరువురు మహిళలను కత్తితో నరుకుతానంటూ దాడికి యత్నించాడు. స్పందించిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనతో స్థానికులు భయాందోళన చెందారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.