VIDEO: ఒంగోలులో సందడి చేసిన అంబటి రాంబాబు
ప్రకాశం: ఒంగోలు పట్టణంలో మాజీ మంత్రి వైసీపీ నేత అంబటి రాంబాబు సోమవారం సందడి చేశారు. వ్యక్తిగత పనులపై నెల్లూరు వైపు వెళ్తున్న అంబటి రాంబాబు, ఒంగోలు నాయకులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా పలువురు ఆయనతో ఫోటోలు తీసుకునేందుకు ఎగబడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంపై తన పోరాటం కొనసాగుతుందని మాజీ మంత్రి అన్నారు.