కడప సీఐపై కేసు నమోదు

కడప సీఐపై కేసు నమోదు

కడప: సీఐ అశోక్ రెడ్డిపై సి.కె.దిన్నె పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. ఆయనపై నాన్‌ బెయిలబుల్ సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అనంతపురం వాసి ప్రభాకర్‌ను బెదిరించి ఆస్తులు సెటిల్‌మెంట్లు చేసినట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో కేసు నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు. కాగా, దీనిపై సమగ్ర విచారణ జరుపుతున్నట్లు పేర్కొన్నారు.