గాంధీ ఆస్పత్రిలో క్యూఆర్ కోడ్‌తో సత్వర రిజిస్ట్రేషన్

HYD: గాంధీ ఆసుపత్రిలో ఓపీ తీసుకోవడానికి పెద్ద క్యూ లైన్‌లో వేచి ఉండడానికి ప్రజలు ఇబ్బంది పడుతుంటారు. వాటికి చెక్ పెడుతూ ఇప్పుడు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ విధానం అందరికీ అందుబాటులోకి వచ్చింది. సాధారణ ప్రజలు తమ ఫోన్‌లో ఆయుష్మాన్ భారత్ (ఆభా) యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ ఆభా నెంబరుతో సులభంగా లాగిన్ కావచ్చు. రోగి వ్యక్తిగత వివరాలన్నీ ఇందులో ఆటోమేటిక్‌గా నమోదు అవుతాయి.